ఒకవైపు అభివృద్ధి జరుగుతోందని ప్రకటనలు…
మరోవైపు రహదారి లేక రోగులను డోలీల్లో మోసుకెళ్తున్న గిరిజనులు!
ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతున్న ఘటన కాదు…
మన దారపర్తి పంచాయతీ పరిధిలో రహదారి సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వస్తున్న ప్రశ్న!
అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లాలన్నా…
అత్యవసర పరిస్థితి ఎదురైతే వైద్యం అందుకోవాలన్నా…
రహదారి సౌకర్యం లేక గిరిజనులు డోలీలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా…
మారుమూల గ్రామాల ప్రజలకు కనీస రహదారి సౌకర్యం అందకపోవడం ఆందోళన కలిగించే విషయo
అసలు దారపర్తి పంచాయతీలో ఈ డోలీ మోతకు ముగింపు ఎప్పుడు?
ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి…
గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటారా?
ప్రజల ప్రశ్న ఒక్కటే… మాకు ఎప్పుడు అందుతుంది రహదారి హక్కు?
ఇది ప్రజల సమస్య… దీనికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే!
0 Comments