Ticker

6/recent/ticker-posts

జిల్లాలో గిరిజనుల పట్టించుకొనే వారు ఎవరు


ఆదివాసీ ప్రజలారా! అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. జీవన పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ముందుకు సాగి జీవితాన్ని కొనసాగిస్తున్న ఆదివాసీ ప్రజలు గొప్ప పోరాట యోధులు. ప్రకృతి తో, సమాజంలోని పెత్తనం సాగించే దోపిడీ దారులతో నిరంతరం పోరాడి ఎన్నో అనుభవాల అధ్యాయాలు కలిగి మరో మహాభారతంలో పాండవుల పాత్ర పోషిస్తున్న గొప్ప యుద్ధవీరులు ఆదివాసీలే. ఏ పోరాటానికైనా ఆది గురువు ఆదివాసీ యుద్ధవీరులే. ఈ నాటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ రోజున భవిష్యత్తు కోసం సరైన ప్రణాళిక వేసుకోవాలి. మనకోసం భారత రాజ్యాంగం లో పేర్కొన్న హక్కులు ప్రమాదంలో పడ్డాయి, మన చుట్టూ ఉన్న సహజ వనరులు, సహజ సంపద దోచుకోవడానికి కార్పొరేట్ పెట్టుబడిదారీ శక్తులు పొంచుకొని వున్నాయి, మనల్ని అణచివేతకు, మన ఆత్మ గౌరవం దెబ్బ తీయాలని మనువాదులు పొంచుకొని వున్నారు. జాగరూకతతో, చైతన్యంతో, మన ఆదివాసీ ప్రజలందరి ఐక్యమత్యంతో సమరశీల పోరుసలపాలి. మనల్ని మనం కాపాడుకోవడం మనందరి భాధ్యత. అందుకోసం ఈ ఆదివాసీ దినోత్సవ రోజున ప్రతిన పూనాలి.ఆదివాసీ దీక్షా దినం గా సంకల్పంతో ముందుకు సాగి మనల్ని మనం రక్షించుకోవాలి. ..జై ఆదివాసీ..జైజై.. ఆదివాసీ 💐💐💐💐✊✊✊✊✊- మీ గౌరీశు

Post a Comment

0 Comments