📍 శృంగవరపుకోట మండలం
━━━━━━━━━━━━━━━━━━
దారపర్తి గిరిజనుల ఆవేదన
7 కిలోమీటర్ల రహదారి ఎప్పుడు పూర్తి చేస్తారు?
శృంగవరపుకోట మండలంలోని
దబ్బగుంట – పల్లాపు దుంగాడ మధ్య నిర్మించాల్సిన
సుమారు 7 కిలోమీటర్ల రహదారి పనులు
2018లో ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదని
దారపర్తి గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
━━━━━━━━━━━━━━━━━━
📌 ప్రజల మాటల్లో...
✅ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు.
అయితే ఇప్పటికీ రహదారి పనులు ఎందుకు ప్రారంభం కాలేదు?
✅ 2019లో అప్పటి ఎమ్మెల్సీ రఘు రాజు గారు,
అప్పటి ఎమ్మెల్యే కడుబంటి శ్రీనివాసరావు గారు
ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.
✅ “ఇకపై ఎవరూ అడ్డుకోరు” అని హామీ ఇచ్చినా,
పనులు మాత్రం మధ్యలోనే ఆగిపోయాయని ప్రజలు అంటున్నారు.
✅ కొంత భాగంలో కాల్వర్టులు నిర్మించినప్పటికీ,
పూర్తిస్థాయిలో రహదారి పనులు జరగలేదని గ్రామస్తులు తెలిపారు.
━━━━━━━━━━━━━━━━━━
📢 గిరిజన ప్రజల ప్రశ్నలు
🔸 మా గ్రామ రహదారిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?
🔸 గిరిజన ప్రాంతాల అభివృద్ధి అంటే ఇదేనా?
🔸 ప్రజల సమస్యలను అడిగే వారు ఎవరూ లేరా?
🔸 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
━━━━━━━━━━━━━━━━━━
⚠️ ప్రజల హెచ్చరిక
దారపర్తి రహదారి సమస్యను వెంటనే పరిష్కరించి
పనులు ప్రారంభించాలని గిరిజన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు స్పందించకపోతే
ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నామని
గ్రామస్తులు హెచ్చరించారు.
━━━━━━━━━━━━━━━━━━
🖋️ వనభూమి
📍 శృంగవరపుకోట మండలం
“గిరిజనుల గొంతుక – ప్రజల హక్కుల కోసం”
0 Comments