🎓 *//జగనన్న విద్యా దీవెన - వసతి దీవెన రెన్యువల్ సమాచారం//**
- - - - - - - - - - - - - - - - - - - - - - 
☛ 2022-2023 విద్యా సంవత్సరమునకు గాను జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకానికి అర్హులైన SC / ST / BC / EBC / Minority / Disabled విద్యార్థిని / విద్యార్థులు ' జ్ఞానభూమి వెబ్ సైట్" లో (http://jnanabhumi.ap.gov.in) రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేసుకొనుట కొరకు ప్రభుత్వము వారు అవకాశము కల్పించుట జరిగినది. 

☛ కావున జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ విషయమును గ్రహించి మీకళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ రెన్యువల్ దరఖాస్తును పంపిణి చేసి మరియు దరఖాస్తులోని అన్ని వివరములను పూర్తి చేసి, దరఖాస్తు మీద విద్యార్థి మరియు తల్లిదండ్రుల సంతకము తీసుకోని వాటిని మీ పరిధిలో ధ్రువీకరించి, అర్హత కలిగిన రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తులన్నిటిని జ్ఞానభూమి వెబ్ సైట్ లో మీకు ఇవ్వబడిన కళాశాల లాగిన్ లో నమోదు చేసి అప్లోడ్ చేయవలెను. 

☛ రెన్యువల్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు గాను గత సంవత్సరము విద్యార్థి సాధించిన మార్కులు మరియు హాల్ టికెట్ నెంబరును ఖచ్చితముగా నమోదు చేయవలెను మరియు గ్రామపంచాయతీ మరియు మునిసిపల్ కార్యాలయములలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల పిల్లలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు అని తెలియపరచటమైనది. 

☛ ఆ విధముగా చేసిన విద్యార్ధిని/విద్యార్థులకు మాత్రమే 2022-2023 విద్యా సంవత్సరమునకు "జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన" మంజూరు చేయుట జరుగును. 

☛ కావున జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ విషయము నందు ఆసక్తి చూపి, మీ కళాశాలలో చదువుచున్న అర్హత కలిగిన విద్యార్థులందరికి ఈ సమాచారము తెలియపరచి మరియు అవగాహనా కల్పించి ది.30-09-2022 తేది లోపు ' జ్ఞానభూమి వెబ్ సైట్ " (http://jnanabhumi.ap.gov.in ) లో రెన్యువల్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకొనవలసినదిగా కృష్ణాజిల్లా, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మరియు సాధికారిత అధికారియైన శ్రీమతి కె.సరస్వతి గారు తెలియపరచటమైనది.
- - - - - - - - - - - - - - - - - - - - - - 
☛ *విద్యార్థులు రెన్యువల్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరి తేది: 30-09-2022.*
- - - - - - - - - - - - - - - - - - - - - -