👰 *వైఎస్సార్ కళ్యాణమస్తు |  వైఎస్సార్ షాదీ తోఫాᵛᶜ - అర్హతలు, విధి విధానాలు* 🤵
- - - - - - - - - - - - - - - - - - - - - - 
■ వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్దిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.
- - - - - - - - - - - - - - - - - - - - - - 
■  వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత.
- - - - - - - - - - - - - - - - - - - - - - 
■ వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు)
- - - - - - - - - - - - - - - - - - - - - - 
■ వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.
- - - - - - - - - - - - - - - - - - - - - - 
■  మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండవచ్చు.

- - - - - - - - - - - - - - - - - - - - - - 
■ కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల మినహాయింపు ఉంది.
- - - - - - - - - - - - - - - - - - - - - - 
■  నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
- - - - - - - - - - - - - - - - - - - - - - 
■ నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
- - - - - - - - - - - - - - - - - - - - - - 
■ ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.
- - - - - - - - - - - - - - - - - - - - - - 
■ మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.
- - - - - - - - - - - - - - - - - - - - - - 
■  ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.
- - - - - - - - - - - - - - - - - - - - - -
      Ysr pelli kanuka 
                Click