Aadhar: ఆధార్ సంఖ్యతో బ్యాంకు ఖాతాను అనుసంధానించడం ఎలా?
No-Author | Samayam Telugu | Updated: May 23, 2018, 4:31 PM
ఆధార్ బ్యాంకు ఖాతా అనుసంధానం కాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో అనుసంధాన ప్రక్రియ ఎలాగో తెలుసుకుందాం.
ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం .. ప్రభుత్వ పథకాలకు, పాన్ కార్డుకు, పాస్ పోర్టు దరఖాస్తు, బ్యాంకు ఖాతా వంటి వాటికి ఆధార్ లింకేజీని తప్పనిసరి చేసింది. వీటిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ ఆధార్ బ్యాంకు ఖాతా అనుసంధానం కాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో అనుసంధాన ప్రక్రియ ఎలాగో తెలుసుకుందాం.
ఆధార్‌తో బ్యాంక్ ఖాతా అనుసంధానానికి ప్రభుత్వం డెడ్‌లైన్లు ప్రకటించిన నేపథ్యంలో వివిధ మార్గాల ద్వారా దీన్ని చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ ఇంకా నేరుగా బ్యాంక్ శాఖకు వెళ్లడం ద్వారా అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
undefined
aadhar-card-linking-to-state-bank-of-India
ఈ ఆన్‌లైన్ క్విజ్ ఆడుతూ మీ తెలివితేటల్ని పరీక్షించుకోండి
aadhar and bank account link content
ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం
నెట్ బ్యాంకింగ్ ఉంటే
ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడేవారు ఆధార్ లింక్ చేసే సేవను అకౌంట్స్ లేదా సర్వీసెస్ సెక్షన్‌లో చూడవచ్చు. ఖాతా సంఖ్యను ఎంచుకొని ఆధార్ నెంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత వివరాలను ధ్రువీకరించాలి. వివరాలు సమర్పించేటప్పుడు ఆధార్‌లోని కేవైసీ సమాచారాన్ని తీసుకునేందుకు బ్యాంకు మన అనుమతి కోరుతుంది. దానిని అంగీకరిస్తూ ఓకే చెప్పాలి.
కొన్ని బ్యాంకులు ఫోన్ ద్వారా కూడా లింకింగ్‌నకు అనుమతిస్తాయి. ఇందుకోసం సదరు నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు రిటర్న్‌లో ఐవీఆర్ఎస్ క్యాల్‌బ్యాక్ వస్తుంది. ఈ కాల్‌లో ఆధార్ లింకింగ్ ప్రక్రియకు సంబంధించి సూచనలు వస్తుంటాయి. సరైన సమాచారం చెప్పినప్పుడు లేదా ఎంటర్ చేసినప్పుడు బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానమైపోతుంది. దీన్ని బ్యాంకు మరో ధ్రువీరించుకుంటుంది.
అనుసంధానమైనట్టు తెలుసుకోవడం ఎలా?
లింకింగ్ ప్రక్రియ పూర్తయినట్టు బ్యాంకులు ఎస్.ఎం.ఎస్‌ల రూపంలో అప్‌డేట్‌లు పంపిస్తాయి. అయినా మనమే స్వయంగా చూడాలనుకుంటే మాత్రం https://resident.uidai.gov.in/bank-mapper ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా నేరుగా ఆధార్ వెబ్‌సైట్‌లోనూ తెలుసుకోవచ్చు.
అనుసంధాన స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఆధార్ సంఖ్య, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు అవసరమవుతాయి. ఆధార్ వివరాలు నమోదు చేశాక రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఈ ఓటీపీ సహాయంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత లింకింగ్ స్టేటస్ తెరపై ప్రత్యేక్షమవుతుంది.
ఆధార్ వెబ్‌సైట్‌లో కేవలం ఒక బ్యాంకు ఖాతాతో లింకింగ్ అయినట్టు చూపిస్తుంది. అది కూడా తాజాగా ఏదైతే బ్యాంకు ఖాతాను అనుసంధానించుకున్నామో దాని వివరాలు మాత్రమే స్టేటస్‌లో చూడవచ్చు. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలున్నవారి తమ అన్ని ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించుకున్నా ఆ వివరాలు ఆధార్ వెబ్‌సైట్‌లో లభ్యం కాకపోవచ్చు.
మరి ఇందుకు పరిష్కార మార్గం ఏదంటే సంబంధిత బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఆధార్ లింక్ అయినదీ లేనిదీ కేవైసీ స్టేటస్‌లో తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి బ్యాంక్ ఖాతా ఆధార్‌తో అనుసంధానితమైన విషయాన్ని ఆయా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా విడివిడిగా తెలుసుకోవచ్చు
సంబంధిత వార్తలు
మీ ఆధార్ కార్డుతో వేరే వాళ్ల మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందా? ఇలా చెక్ చేసుకోండి!
బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డ్‌ను లింక్ చేసుకోవడం ఎలా? చేతిలో ఫోన్ ఉంటే చాలు..
ఆధార్ కార్డులో పలు రకాలు..? ఒక్కో దాని గురించి తెలుసుకోండి
ఆధార్ కార్డులో అడ్రస్ తప్పుగా ఉందా - మీరే అప్‌డేట్ చేసుకోవచ్చు - Aadhaar సెంటర్‌కు వెళ్లకుండానే..
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చా? ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి!
తరవాత కథనం
Aam Aadmi Beema Yojana:నిరుపేదల ప్రయోజనం కోసం ఆమ్ ఆద్మీ బీమా యోజన
Aam Aadmi Beema Yojana:నిరుపేదల ప్రయోజనం కోసం ఆమ్ ఆద్మీ బీమా యోజన
Subscribe to Notifications
undefined
'సమయం వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి
Follow Us
Install
Follow Us
245K+
Likes
4K+
Followers
85.6K+
Subscribers
మరింత సమాచారం తెలుసుకోండి
uidaiLink Aadharbank accountAadhar newsaadhar bank account linkageAadhar
Web Title : how to link aadhar with bank account number..
Telugu News from Samayam Telugu, TIL Network
Telugu NewsBusinessBusiness NewsHow To Link Aadhar With Bank Account Number..
యాప్‌లో చదవండి
Samayam Telugu
యాప్‌లో ఆర్టికల్ చదవడాన్ని కొనసాగిస్తారా?
యాప్ ఓపెన్ చెయ్యండికొనసాగించండి
0 Comments